శ్రీకాకుళం : అక్టోబరు 29 : రైతు భరోసా గడువును నవంబరు 15వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 3.50 లక్షల మంది రైతు భరోసా క్రింద లబ్దిపొందారని చెప్పారు.ఆధార్ సీడింగ్ లేకపోవడం వలన, ఆధార్ నెంబరు బ్యాంకు ఖాతాకు అనుసంధానం కాకపోవడం, ప్రజాసాధికార సర్వేలో వివరాలు లేకపోవడం వంటి అంశాల వలన భరోసా నగదు కొందరి రైతుల ఖాతాల్లో జమ కావడంలో కొన్ని సమస్యలు వచ్చాయన్నారు. వీటిని పరిష్కరించుటకు బుధవారం నుండి వారం రోజులపాటు గ్రామ సభలు నిర్వహించి రైతుల సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. బ్యాంకు సంబంధిత సమస్యలు, రెవిన్యూ, వ్యవసాయ శాఖలకు సంబంధించిన సమస్యలు ప్రధానంగా వీటిలో పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు. రైతులు తమ వివరాలు వెబ్ ల్యాండ్ లో లేనప్పటికి అన్ సీడెడ్ క్రింద దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన చెప్పారు.
నవంబరు15వ తేదీ వరకు రైతు భరోసా