శ్రీకాకుళం : అక్టోబరు 29 : రాష్ట్రంలో స్పందన కార్యక్రమంను సమర్ధవంతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నేడు వీడియో కాన్ఫిరెన్సులో ఆదేశించారు. స్పందనలో రాష్ట్రంలో 6,99,548 ఆర్జీలు అందాయని వాటికి నాణ్యమైన పరిష్కారాలు ఉండాలని పేర్కొన్నారు. డిసెంబరు 15 నాటికి గ్రామ సచివాలయాలు పూర్తి స్థాయిలో పనిచేయుటకు సిద్దం చేయాలని ఆదేశించారు. సచివాలయం ప్రక్కనే ధృవీకరించిన నాణ్యమైన విత్తనాలు రైతులకు లభ్యంగా ఉండాలని అన్నారు. అవినీతికి ఎక్కడా తావు వుండరాదని దీనిపై జిల్లా కలెక్టర్ లు, ఎస్పీలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.
స్పందన కార్యక్రమంలో వచ్చిన పిర్యాదులు సత్వరంపరిష్కరించాలి