పారిశుద్య కార్మికులకు పి.యఫ్ మరియు ఇ.యస్.ఐ వర్తింపజేయాలి

టెక్కలి : అక్టోబరు 29 : పారిశుద్ధ్య కార్మికులుకు మరియు పంచాయతీ లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు  తక్షణమే పి.యఫ్. అలాగే ఇ.యస్.ఐ  వర్తించే విధంగా చర్యలు చేపట్టాలని భారతీయ జనతా మజ్దూర్ సెల్  రాష్ట్ర కన్వీనర్ నాయుడు టెక్కలి పంచాయతీ కార్యదర్శి చమళ్ల మధుని కోరారు.వ్యక్తిగతమైన వేలం విధానాన్ని రద్దు చేయాలని కోరారు.పంచాయితీ కార్మికులకు వేతనాలు చెల్లించినందుకు ఇ.ఓ కు జిల్లా పంచాయితీ ఆఫీసర్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వీరితో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, టెక్కలి నియోజకవర్గ కన్వీనర్ హనుమంతు ఉదయ్ భాస్కర్, బి.జె.యమ్.సి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకెళ్ల సూరిబాబు, జిల్లా అధ్యక్షులు కోరాడ నారాయణరావు, బీజేపీ టెక్కలి మండల ప్రధాన కార్యదర్శి అడవి రాజు పాల్గొన్నారు.