శ్రీకాకుళం : అక్టోబరు 29: పత్తి కొనుగోలు ఈ క్రాప్ బుకింగ్ త్వరితగతిన పూర్తి చేయాలని సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. మంగళవారం జె.సి.ఛాంబరులో పత్తి కొనుగోలుపై జె.సి. ఆధ్వర్యంలో జిల్లా స్ధాయీ కమిటీ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పత్తి రైతునుఆదుకుంటున్నదని,మద్దతు ధరను క్వింటాలుకు రూ.5,550 లుగా ప్రకటించడం జరిగిందని తెలిపారు.రాజాం మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి త్వరితగతిన ఏర్పాట్లు చేయాలన్నారు. వ్యవసాయ శాఖాధికారులు త్వరితగతిన ఈ క్రాప్ బుకింగ్ పూర్తి చేయాలన్నారు. అగ్నిమాపక అధికారులు ఎక్విప్మెంటును సిధ్ధం చేయాలన్నారు. పత్తి రైతులు దళారులబారిన పడకూడదన్నారు.గ్రామాలలో ఈ క్రాప్ బుకింగ్, మద్దతు ధర, తదితర అంశాలపై వారికి అవగాహన కలిగించాలన్నారు.ఎనిమిది శాతం లోపు తేమ వున్న పత్తి పంటకు పూర్తి మద్దతు ధర లభిస్తుందన్నారు. రైతులు సద్వినియోగపరచుకోవాలని జె.సి. ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రత్తి కొనుగోలు సత్వరం చేపట్టాలి: జె.సి శ్రీనువాసులు