చిన్న పత్రికలు స్థానిక సమస్యలను వెలికి తీయటంలో ముందుండాలి

విజయవాడ : అక్టోబరు 31: స్థానిక సమస్యలు వెలికి తీయడంలో చిన్న పత్రికలు కీలకపాత్ర పోషించాలి.
చిన్న పత్రికలు నడిసే యాజమాన్యాలు ఒక సిండికేట్ లా తయారై అభివృద్ధి కార్యక్రమాలు , ప్రభుత్వ ప్రవేశ పెట్టిన పథకాలను ఎలా అమలవుతున్నాయో అనే విషయాలపై కధనాలు అందించాలని ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు . ప్రజలకు సమాచారం అందించడంలో చిన్న పత్రికలు ప్రధాన భూమిక పోషించి స్థానిక సమస్యలు వెలికితీయడంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. పెద్దపత్రికల నిర్వాహణా వ్యయభారం పెరగడంతో మనుగడ కష్టసాధ్యంగా మారిన తరుణంలో ఆ పరిస్థితిని చిన్న పత్రికలు సానుకూలంగా మలచుకోవాలని ఆయన పేర్కొన్నారు .రాష్ట్ర చిన్న , మధ్య దినపత్రికల సంఘం రజతోత్సవ వేడుకలు గురువారం నగరంలోని ప్రైవేట్ హోటల్ లో నిర్వహించారు . కార్యక్రమానికి ముఖ్యఅతిధిలుగా హాజరైన ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి , రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ( పబ్లిక్ పాలసి ) కె . రామచంద్రమూర్తి మరియు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనరు మరియు ఎ ఫీషియో సెక్రటరి తమ్మా విజయకుమార్ రెడ్డిలు జ్యోతి ప్రజ్యలన చేసి ప్రారంభించారు .ఈసందర్భంగా ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లో 250 వరకు చిన్న పత్రికలు ఉంటుండగా , మనరాష్ట్రంలో 60 నుంచి 70 వరకు మాత్రమే చిన్న పత్రికలు ఉన్నాయన్నారు . చిన్న పత్రికలు అందే ఆదాయంకోసమే ఉన్నాయన్న భావన ఉండేదని కానీ ప్రజలకు సమాచారం అందించడంలో చిన్న పత్రికల పాత్ర ఎనలేనిదన్నారు . అమెరికాలో పెద్ద పత్రికలు కన్నా స్థానిక సమాచారం అందించడంలో చిన్న పత్రికలకు చాలా ప్రాముఖ్యం ఉందన్నారు . రాజకీయాలకు మీడియాను ఒకసాధనంగా ఉపయోగించుకోవడంతో పాటు ప్రజల మెదడులను సైతం ప్రలోభాలకు గురిచేసేవిధంగా గతంలో మీడియా వ్యవహరించిందన్నారు . అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ , డిజిటల్ మీడియా , సోషల్ మీడియాలతో ప్రజలకు సమాచారం విరివిగా లభిస్తుందన్నారు . కమ్యూనికేషన్ వ్యవస్థ పెరిగిందన్నారు . పెద్ద పత్రికలు చిన్న టాబ్లాయిడ్తో స్థానిక సమస్యలు ఇస్తున్నా , చిన్న పత్రికలు వారికి ఉన్న స్పే ' ఎక్కువుగా స్థానిక సమస్యల పై ఫోకస్ పెట్టి ఇస్తే వాటికి ఆదరణతో పాటు ఆదాయంకూడా లభిస్తుందన్నారు . చిన్నపత్రికలకు ఇది మంచికాలంగానే చెప్పవచ్చన్నారు . మన చుట్టూ జరిగే విషయాలపై మనం దృష్టి పెట్టి మంచి స్టోరీ వ్రాస్తే గుర్తింపుతో పాటు ప్రజల ఆసక్తి పెరిగి పాపులారిటీ వస్తుందన్నారు . ఏదైనా పేపరు సర్క్యులేషన్‌తోపాటు అడ్వర్టయిజ్ మెంట్స్ ఉంటేనే గుర్తింపు వస్తుందన్నారు . వార్తల చెక్స్ అండ్ బ్యాలెన్స్ లో మీడియా ప్రధానపాత్ర వహించాలన్నారు . గతంలో వార్తలు అందించే విషయంలో ప్రజల మెదడులకు సైతం సంకెళ్లు వేయడానికి కృషి చేసారన్నారు . రాష్ట్రంలో చిన్న పత్రికలు పెరగడానికి స్కోప్ ఎక్కువుగా ఉందని అన్నారు . చిన్న పత్రికలు చాస్తవవిషయాలపై దృష్టిసారించి ఆవార్తలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే విధంగా కధనాలు అందిస్తే ప్రజల్లో ఆదరణ , విశ్వసనీయత పెరుగుతుందన్నారు . వాక్ స్వాతంత్యం , భావప్రకటన స్వేచ్చ అనేది పెద్ద పత్రికలకు ఎంత ఉంటుందో , చిన్న పత్రికలకు అంతే ఉంటుందన్నారు . చిన్న పత్రికలు కలం , బలం ఉపయోగించుకుని కాలానుగుణంగా ఎదగాలన్నారు . చిన్న పత్రికలలో మహిళా సంపాదకులను ప్రోత్సహించాలి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ( పబ్లిక్ పాలసి ) కె . రామచంద్రమూర్తి మాట్లాడుతూ 25 సంవత్సరాలపాటు చిన్న , మధ్య పత్రికల సంఘం విజయాలు సాధించడం గర్వించదగ్గ విషయం అన్నారు . ప్రభుత్వం పారదర్శకంగా ఉండడానికి పత్రికా స్వేచ్చ జీవో ఇచ్చారని అలాకాకపోతే జిల్లా యస్ పిలు , కలెక్టర్లతో కేసులు కావాలని పెట్టించిన సందర్భాలు కూడా రాష్ట్రంలో ఉన్నాయన్నారు . అసత్యవార్తలు వ్రాసేవారిపై కేసులు పెట్టే హక్కు పాఠకులకు ఉన్నవిధంగానే అసత్య ఆరోపణలపై వార్తలు వ్రాసినవారిపై కేసులు తప్పుకాదన్నారు . లిటిగేషన్స్ పై కేసులు పెట్టినంత మాత్రాన ఏమీ కాదని , వ్రాసిన వార్తలో నిజం ఉంటేనే ఆకేసులు నిలుస్తాయన్నారు . చిన్న పత్రికలు సమాజ గౌరవం పొందితేనే వాటికి ఆదరణ ఉంటుందన్నారు . చిన్న పత్రికలు ఎక్కువుగా ఎమ్ ప్యానల్ పొందాలని సూచించారు . చిన్న పత్రికలలో మహిళా సంపాదకులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు . ప్రకటనల రేటును 60 శాతానికి పెంచిన ఘనత ముఖ్యమంత్రిదే. కమిషనరు విజయకుమార్ రెడ్డి . సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనరు తమ్మా విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ చిన్న , పెద్ద పత్రికలు అనే తారతమ్యం లేకుండా ప్రకటనల రేటును 60 శాతం పెంచిన ఘనత ముఖ్యమంత్రి వై . యస్ . జగన్మోహన రెడ్డికే దక్కుతుందన్నారు . ప్రభుత్వానికి అనుకూలంగా వ్రాసినా , వ్యతిరేకంగా వ్రాసినా చిన్న , పెద్ద పత్రికలు అనే తేడా లేకుండా అన్ని పత్రికలకు ఒకేరకంగా పెంచాలని సమావేశంలో ముఖ్యమంత్రి సూచించారని తెలిపారు . దీన్నిబట్టి ప్రభుత్యం మీడియా రంగానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నదో తెలుస్తున్నదన్నారు .
ఎవరికీ కొమ్ము కాయకుండా నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురించుకునే వెసులుబాటు చిన్న , మధ్యతరహా పత్రికలకు ఉందన్నారు . సమాజంలో చిన్న పత్రికలకు చాలా ప్రాముఖ్యం ఉంటుందన్నారు . డిజిటల్ మీడియా , సోషల్ మీడియా రావడంతో వారల నిడివి పెరిగిందన్నారు . నిజాన్ని నిజంగా , నిజాయితీగా స్థానిక సమస్యలను వెలుగులోనికి తీసుకువచ్చే శక్తి చిన్న పత్రికలకు ఉందన్నారు . డవలపింగ్ జర్నలిజం అంటే లేనిది ఉన్నట్లుగా వ్రాయకుండా అభివృద్ధికి బాటలు వేసే స్థానిక సమస్యలను వెలికి తీయడమేనన్నారు . అభివృద్ధి జర్నలిజానికి అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు . రాష్ట్ర ముఖ్యమంత్రి వై . యస్ . జగన్మోహన రెడ్డి వ్యతిరేక వార్తల పైనే ఎక్కువ దృష్టి సారిస్తే వాటికి పరిష్కారం లభిస్తుందని అంటారని తెలిపారు .చిన్న పత్రికల పురోభివృద్ధికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు . త్వరలోనే ఇహెచ్ యస్ క్రింద జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్ కు సంబంధించి జీవో రానున్నదని అదేవిధంగా చిన్న పత్రికలకు సంబంధించి బిల్లులను కూడా క్లియర్ చేయడం జరుగుతుందని , వైయస్ఆర్ జర్నలిస్టు భీమాను కూడా త్వరలోనే తీసుకువస్తామన్నారు . జర్నలిస్టుల సమస్యలేమైనా ఉంటే కమిషనరు కార్యాలయంలో ఎప్పుడైనా తెలియజేయవచ్చని అన్నారు . చిన్న పత్రికలకు రాజకీయ ఎజెండా ఉండదు . సభకు అధ్యక్షత వహించిన చిన్న , మధ్యతరహా పత్రికల అధ్యక్షులు కె. బి. జి. తిలక్ మాట్లాడుతూ చిన్న పత్రికలకు పక్షపాతం ఉండదని అలాగే బ్రతుకు తెరువు తప్ప రాజకీయ ఎజెండా ఉండదన్నారు . గత ఐదు సంవత్సరాలుగా మరిన్ని ఆటుపోట్లతో సంఘ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందన్నారు . క్రొత్త ప్రభుత్వం ఒక్కొక్కరికీ న్యాయం చేసుకుంటూ వస్తున్నదని , అలాగే మన సమస్యలు కూడా ప్రభుత్వానికి పూర్తిగా తెలుసునని అన్నారు . చిన్న పత్రికలకు 8 సంవత్సరాల నుండి ప్రకటనల రేట్లు పెంచాలని కోరుతున్నా గత ప్రభుత్యాలు పెంచ లేదని , క్రొత్త ప్రభుత్వం ఒకేసారి 60 శాతం ప్రకటనల రేటు పెంచడం పత్రికా రంగానికి ఎంతో మేలు చేస్తుందన్నారు . సత్రికారంగంలో పేదవరా లైన చిన్న పత్రికలకు ప్రస్తుత ప్రభుత్వంలో న్యాయం జరుగుతున్నదన్నారు . ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వ్రాయవద్దని ఎవరూ అనలేదని , జీవోలో ఉన్న సారాంశాన్ని పత్రికలు యధాతథంగా ప్రచురిస్తే మంచిదని , కానీ కొన్ని పత్రికలు జీవోను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు . చిన్న పత్రికలు నిష్పక్షపాతంగా వాస్తవాలను వక్రీకరించకుండా వ్రాస్తున్నాయని ఇకముందుకూడా అలాగే ఉంటామని తిలక్ పేర్కొన్నారు . గౌరవాధ్యక్షులు రంగసాయి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వై . యస్ . రాజశేఖర రెడ్డి హయాంలో చిన్న పత్రికలకు ఎంతో మేలు జరిగేవిధంగా ప్రోత్సహించారన్నారు . ఆనాడు చిన్న పత్రికల సంఘం ఏర్పాటు చేసి అక్రిడిటేషన్ కమిటీలో, జర్నలిస్టులపై రాథుల కమిటీలో సభ్యులుగా చేర్చడానికి కృషి చేసామన్నారు .ముందుగా ఇటీవల మృతి చెందిన సీనియర్ పాత్రికేయులు సి . రాఘవాచారి మృతి పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఈ కార్యక్రమంలో పదమూడు జిల్లాలకు చెందిన చిన్న పత్రికల సంపాదకులు హాజరయ్యారు .