శ్రీకాకుళం : అక్టోబరు 31: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు సిధ్ధం చేపట్టాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు.గురువారం జిల్లా పరిషత్ సమావేశమందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఎన్ వి.బి.డి.సి.పి.(కీటక జనిత వ్యాధుల) నిర్మూలనపై జిల్లా స్ధాయీ కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో నమోదైన మలేరియా,డెంగ్యూ కేసుల వివరాలను కలెక్టర్ వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 84 వైద్య బృందాలు, 791 పారా మెడికల్ బృందాలు, 172 సూపర్ వైజరీ బృందాలు పనిచేస్తున్నాయని, 3107 మంది ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు పనిచేస్తున్నారని జిల్లా మలేరియా అధికారి తెలిపారు. జనవరి నుండి ఇప్పటివరకు 14,137 డయేరియా కేసులు, 1909 డైఫాయిడ్ కేసులు, 112 మలేరియా కేసులు, 89 డెంగ్యూ కేసులు, 10 సైన్ ఫ్ల్యూ కేసులు నమోదయ్యాయని డిఎంఓ వివరించారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలోను, అన్ని గ్రామ పంచాయితీలలోను ఏంటీ లార్వా చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతీ వార్డులోను స్ప్రేయింగ్, ఫ్యాగింగ్, కాలువలలో పూడికతీత పనులను చేపట్టాలన్నారు. ఖాళీ స్ధలాలలో నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మలేరియా స్ప్రేయింగ్ సామగ్రిని సమకూర్చుకోవాలని తెలిపారు. అన్ని గ్రామ పంచాయితీలలోను పంచాయితీ సెక్రటరీలు, వైద్య సిబ్బంది, స్వీపర్ల ద్వారా ఎంటీ లార్వా ఆపరేషన్ చేయాలన్నారు.అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలోను మలేరియా నిర్ధారణ పరికరాలు, మందులను అందుబాటులో వుంచాలన్నారు.గృహాలలో నీటి నిల్వలు వుండరాదన్నారు. అవసరం మేరకు ఇండోర్ స్పేస్ స్ప్రే, ఔట్ డోర్ ఫ్యాగింగ్ చేయాలన్నారు. డోర్ టు డోర్ లార్వా చెకింగ్ చేయాలన్నారు. పాఠశాలలోని విద్యార్ధులకు కీటకజనిత వ్యాధులపై అవగాహన కలిగించడం, వ్యాధులు సోకిన విద్యార్ధుల వివరాలను వైద్యాధికారులకు తెలపడం వంటి చర్యలను ఉపాధ్యాయులు చేపట్టాలన్నారు.ఏంటీ లార్వా చర్యలపై రోజవారీ నివేదికలను అందచేయాలన్నారు. వైద్యాధికారులు, మున్సిపల్ అధికారులు, పంచాయితీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. పట్టణాలలోను, గ్రామాలలోను పరిశుభ్రవాతావరణాన్ని నెలకొల్పి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఈ సమావేశానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.ఎం.చెంచయ్య, జిల్లా మలేరియా అధికారి డా. వీర్రాజు, జిల్లా పరిషత్ సిఇఓ జి.చక్రధరబాబు, డి.పి.ఓ. రవికుమార్, డి.సి.హెచ్.ఎస్. బి.సూర్యారావు, డా. ఎల్.మోహన రావు, శ్రీకాకుళం నగరపాలసంస్థ కమీషనరు గీతాదేవి, హెల్త్ ఆఫీసర్ జి.వెంకటరావు, మెప్మా పి.డి. ఎం.కిరణ్ కుమార్, ఐసిడిఎస్ పి.డి.జయదేవి,రాజాం, పాలకొండ, ఆమదాలవలస, పలాస, ఇఛ్ఛాపురం మున్సిపల్ కమీషనర్లు ఎన్.రమేష్, లిల్లీ పుష్పనాథం, ఎస్.రవి, టి.నాగేంద్రకుమార్, ఎల్.రామలక్ష్మి అదనపు జిల్లా వైద్యాధికారి డా.బి.జగన్నాధ రావు, డిబిసిఎస్, డి.పి.ఎం డా.జి.వి.రమణకుమార్, డి.ఎం.అండ్.హెచ్.ఓ కార్యాలయపు డెమో పైడి వెంకట రమణ,తదితరులు హాజరైనారు.
సీజనల్ వ్యాదులపై అప్రమత్తంగా ఉండాలి