భారతీయులంతా ఐక్యతతో అభివృద్ధికి పాటుపడాలి

శ్రీకాకుళం : అక్టోబర్ 31 : జిల్లాలోని ప్రతీ పౌరుడు ఐక్యత కోసం పోటీపడాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.సర్ధార్ వల్లభాయి పటేల్ జయంతి సందర్భంగా జిల్లా క్రీడాప్రాధికార సంస్థ మరియు యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏక్తా దివాస్ ర్యాలీ కార్యక్రమం గురువారం ఉదయం స్థానికఏడురోడ్ల కూడలి వద్ద జరిగింది.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జె.నివాస్ మరియు జిల్లా సూపరింటెంటెంట్ ఆఫ్ పోలీసు అమ్మిరెడ్డి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ముందుగా జిల్లా కలెక్టర్ సర్ధార్ వల్లభాయి చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఐక్యతా పరుగునకు పచ్చజెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్ధార్ వల్లభాయి పటేల్ జయంతినిపురష్కరించుకొని భారతీయ ఏక్తా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని గుర్తుచేసారు. భారతదేశం విభిన్న రాష్ట్రాలు, మతాలు, భాషలు, సంస్కృతులు కలిగినప్పటికీ భారతీయులందరూ ఏకమై కలిసిఉండటానికి ప్రధానకారణం సర్ధార్ వల్లభాయి పటేల్ అని గుర్తుచేసారు.