మాదక ద్రవ్యాలపై చైతన్యం అవసరం

శ్రీకాకుళం :అక్టోబరు 29: మాదక ద్రవ్యాల నియంత్రణపై చైతన్య సదస్సునుబుధవారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నట్లు నెహ్రూ యువకేంద్రం జిల్లా కోఆర్డినేటర్ ఎస్.శివప్రసాద రెడ్డి తెలిపారు.మంగళవారం ఎన్.వై.కెకార్యాలయంలో ఆయన పాత్రికేయులతో సమావేశాన్ని నిర్వహించారు. దేశానికివెన్నెముక అయిన యువత మద్యానికిమాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్నతరుణంలో యువతను మంచి బాటలో నడిపించడానికి యువతకు అవగాహన కలిగించవలసిన ఆవశ్యకత మనముందుఉందన్నారు.భారత ప్రభుత్వం యువజన  వ్యవహారాలు మరియు క్రీడలు మంత్రిత్వ శాఖ నెహ్రూయువకేంద్రం శ్రీకాకుళం మరుయు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్  మరియు మినిస్ట్రీ ఆప్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్ మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో "ప్రివెన్షన్ ఆఫ్ డ్రగ్ ఎబ్యూజ్" (మాదక ద్రవ్యాల నియంత్రణ ) అనే అంశంపై చైతన్య సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారుమద్యానికి బానిసగా మారడం ద్వారా కుటుంబాన్ని,మంచి సమాజాన్ని కోల్పోయి ఒంటరిగా  బ్రతుకవలసిన  పరిస్ధితులను  సదస్సులో వివరించడం జరుగుతుందన్నారుప్రతీ గ్రామంలోను ఇటువంటి అవగాహనా సదస్సులను నిర్వహించవలసిన ఆవశ్యకత వుందన్నారు.  కళాశాల విద్యార్ధులువిద్యార్ధినులుయువజన సంఘాలునిరుద్యోగ యువతకు  సదస్సులో అవగాహన కలిగించనున్నామని తెలిపారుసుమారు వంద నుండి 150 మంది యువతకు  సదస్సులో అవగాహన కలిగించడం జరుగుతుందని చెప్పారు.అనంతరం మాదక ద్రవ్యాల నియంత్రణ గోడపత్రికను విడుదల చేసారు.  సమావేశంలో వావిలపల్లి జగన్నాధం నాయుడుతదుతరులు పాల్గొన్నారు.