అంగవైకల్యులు కూడా ఒలింపిక్ స్థాయికి ఎదగాలి

శ్రీకాకుళం : నవంబరు 27 :   జిల్లాలో గల  దివ్వాంగ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, పారా ఒలింపిక్స్ స్థాయి పోటీలలో పాల్గొని పతకాలు సాధించాలని జిల్లా కలెక్టరు జె.నివాస్  క్రీడాకారులను ప్రోత్సహించారు.  స్థానిక బాలుర ఆర్ట్స్ కళాశాల మైదానంలో ప్రారంభమైన దివ్యాంగుల జిల్లాస్థాయి క్రీడాపోటీలను బుదవారం జిల్లా కలెక్టరు ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయిలో జరుగుచున్న  ఆటల పోటీలలో చక్కని ప్రతిభ కనబరిచిన  దివ్వాంగ క్రీడాకారులను రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి పోటీలకు  ఎంపికచేయటం జరుగుతుందన్నారు.  క్రీడాకారులకు పలు విభాగాలలో క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. సుమారు 350 మంది ఈ  క్రీడా పోటీలలో పాల్గొంటున్నారని, వీరికి పరుగు పందెం, లాంగ్ జంప్, షార్ట్ ఫుట్, ట్రై సైకిల్ పోటీలు, క్రికెట్ తదితర విభాగాలలో పోటీలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. క్రీడాకారులు చక్కని ప్రతిభ కనబరిచి పారాఒలింపిక్స్ కు ఎంపిక కావాలని  ఆకాంక్షించారు.  ఈ క్రీడాపోటీలలో పాల్గొంటున్న క్రీడాకారులకు  జిల్లా కలెక్టరు  శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ  సహాయ సంచాలకులు కె. జీవన్ బాబు, జిల్లా క్రీడాభివృది అధికారి  బి.శ్రీనివాసు, జిల్లాఒలింపిక్ సంఘం సెక్రటరీ పి.సుందరరావు, విద్యాంగ ఉద్యోగులరాష్ట్ర సంఘ ముఖ్యకార్యదర్శి ఎం .కె.మిశ్ర, జిల్లా దివ్యాంగ ఉద్యోగుల అధ్యక్షులు బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.