ఆరోగ్యశ్రీ విధి విధానాలు ఖరారు

అమరావతి : నవంబరు :15 ఏపీ ప్రజలు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటికే ఆరోగ్య శ్రీ పథకంలో అనేక మార్పులు తీసుకొచ్చి సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రజలకు ఈ పథకం అమలయ్యేలా చేయాలని భావించిన జగన్ ప్రభుత్వం తాజాగా ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది.5 లక్షల రూపాయలు వార్షిక ఆదాయం ఉన్నవారికి కూడా ఆరోగ్య శ్రీ వర్తింప జేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెల్ల రేషన్ కార్డు, వైఎస్ఆర్ పెన్షన్ కార్డులవారికి ఆరోగ్యశ్రీ వర్తించనుంది.  5 లక్షల రూపాయలు లోపు వార్షిక ఆదాయం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ పథకం వర్తింపజేయనున్నారు. 12 ఎకరాల మాగాణి, లేదా 35 ఎకరాలలోపు మెట్ట ఉన్నవారికి వర్తించేలా ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో మార్పులు తీసుకొచ్చింది.తాము అధికారంలోకి వస్తే 1000 రూపాయలు  దాటిన వైద్య ఖర్చులను ఆరోగ్య శ్రీ పథకం వర్తించేలా చేస్తామని హామీ ఇచ్చిన జగన్ అందుకు తగ్గట్టుగానే నిర్ణయం తీసుకున్నారు. ఏపీతో పాటు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ ఆరోగ్య శ్రీ పథకం వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు.