11వ తేదీన మైనారిటీ సంక్షేమ దినోత్సవం

శ్రీకాకుళం : నవంబరు 8 : ఈ నెల 11 వ తేదీన మైనారిటీ సంక్షేమ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మైనారిటీ సంక్షేమ శాఖాధికారి ఎం.అన్నపూర్ణమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు  మైనారిటీ సంక్షేమ దినోత్సవ కార్యక్రమాన్ని  నిర్వహించనున్నామని,11వ తేదీ ఉదయం 10 గంటలకు బాపూజీ కళా మందిరంలో కార్యక్రమం ప్రారంభం అవుతుందని ఆ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి  జిల్లా కలెక్టర్, మైనారిటీ లీడర్లు  కార్యక్రమంలో పాల్గొంటారని  ఆమె చెప్పారు.