శ్రీకాకుళం : నవంబరు 12 : నవంబరు 14వ తేదీ నుండి 20 తేదీ వరకు 52వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు నిర్వహించ నున్నట్టు జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి కె. కుమార్ రాజా మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. నవంబరు 14న బాలల దినోత్సవం సందర్భంగా జరిగే కార్యక్రమంలో ముఖ్య ఆతిధిగా శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు పాల్గొంటున్నట్టు తెలిపారు. నవంబరు 15వ తేదీన పుస్తక ప్రదర్శన, 16వ తేదీన గ్రంధాలయ ఉద్యమ కారుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా ఉత్తమ గ్రంధపాలకుల సత్కారం. కవితా దినోత్సవం సందర్భంగా నవంబరు 17 తేదీన హైస్కూలు విద్యార్దులకు వక్తృత్వ పోటీలు, 18వ తేదీన వ్యక్తిత్వ వికాస దినోత్సవం సందర్భంగా 8,9,10 తరగతి విద్యార్ధులకు క్విజ్ పోటీలు, 19వ తేదీన రంగవల్లికల పోటీలు, 20 తేదీన అక్షరాస్యత దినోస్తవం సందర్భంగా ర్యాలీ నిర్వహించి, అనంతరం ముగింపు కార్యక్రమం జరుగునని తెలిపారు. గ్రంధ పాఠకులు, ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయవలసినదిగా కోరారు.
14వ తేదీనుండి గ్రంధాలయం వారోత్సవాలు