19 వ తేదీన రాగోలులో కిసాన్ మేళా

శ్రీకాకుళం : నవంబరు 14 : రాగోలు వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో 19వ తేదీన కిసాన్ మేళాను నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ పరశోధనా కేంద్రం ప్రధాన శాస్త్ర వేత్త డా.కె.వి.రమణ మూర్తి గురు వారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, రాష్ట్ర రహదారులు భవనాలు శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని ఆయన చెప్పారు. కిసాన్ మేళా కార్యక్రమంలో దాదాపు ఐదు వందల మంది రైతులు పాల్గొంటారని ఆయన అన్నారు. వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్ర వేత్తలతోపాటు వివిధ రంగాల్లో నిపుణులైన శాస్త్ర వేత్తలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొని రైతులకు సాంకేతిక, ఆధునిక వ్యవసాయ పద్ధతులు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారని ఆయన చెప్పారు.