గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా కార్యక్రమం

శ్రీకాకుళం : నవంబరు :16 గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా  కేంధ్రగ్రంధాలయ సమావేశ మందిరంలో గ్రంధాలయ ఉద్యమకారుల సంస్మరణ దినోత్సవము నిర్వహించ బడినది. జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి కె. కుమార్ రాజా అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంధాలయ సంఘం ఆధ్యక్షులు బటిన శ్రీరాములు, కార్యదర్శి డబ్బీరు గోవిందరావు తదితరులు మాట్లాడుతూ గ్రంధాలయోద్యమములో పాల్గొని గ్రంధాలయాలు అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేసిన పాతూరు నాగభూషణం, అయ్యంకి వెంకటరమణయ్యను స్మరించి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఉత్తమ గ్రంధపాలకులుగా ఎంపికైన పోలాకి శాఖా గ్రంధాలయం అధికారి కె.బి. సుబ్రహ్మణ్యం, భామిని శాఖా గ్రంధాలయం అధికారి కె. సునీత, వీరఘట్టాం శాఖా గ్రంధాలయ అధికారి పి. వరలక్మీలను జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి కె. కుమారరాజా,రీడర్స్ ఫోరం అధ్యక్షులు డా. ఇ. ఎస్. సంపత్ కుమార్ సన్మానించారు.అనంతరం పాఠశాల విద్యార్ధిని, విద్యార్ధులకు వక్తృత్వ పోటీలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆదిత్యా ఇంజనీరింగా కళాశాల లైబ్రేరియన్ డా. ఎమ్.వి. సుబ్బారావు, కేంద్ర గ్రంధాలయం డిప్యూటీ లైబ్రేరియన్ జి. తిరుమలకుమారి అసిస్టెంట్ లైబ్రేరియన్ ఏ.వి. రమణమూర్తి, గ్రంధాలయ సిబ్బంది,రీడర్స్ తదితరులు పాల్గోన్నారు.