శ్రీకాకుళం : నవంబరు 18: ఈ నెల 20 వ తేదీన తప్పనిసరిగా గ్రామ సభలను నిర్వహించాలని రాష్ట్ర పౌర సరఫరాల కమీషరు కోన శశిధర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. హౌస్ హోల్డ్ సర్వే,మ్యాపింగ్, క్లస్టర్ల వెరిఫికేషన్, డేటా ఎంట్రీలు, ప్రింటింగ్, శిక్షణా కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు.ఈ నెల 20వ తేదీన ఒక పండుగ వాతావరణంలో గ్రామ సభలను నిర్వహించాలని, ప్రజాప్రతినిధుల సమక్షంలో కార్యక్రమం జరగాలని ఆయన ఆదేశించారు.అదే రోజు ఇంటింటి సర్వే కార్యక్రమం ప్రారంభించాలన్నారు. వివిధ శాఖల ద్వారా అందిస్తున్న పింఛనులు, ఆరోగ్యశ్రీ, ఫీజు-రియంబర్స్ మెంట్ వంటి సంక్షేమ పథకాలను నిజమైన లబ్దిదారులకు అందించడానికి సర్వే కార్యక్రమం ఆవశ్యకమన్నారు. క్లస్టర్ల మ్యాపింగ్ నిక్కచ్చిగా చేపట్టాలన్నారు. ఏ వాలంటీరు ఏ క్లస్టర్ పరిధిలో పని చేయనున్నారో తెలియచేయాలన్నారు. సర్వే బృందాలకు ముందస్తుగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వార్డు, విలేజ్ సెక్రటేరియట్ పూర్తి స్థాయి ఏర్పాట్లపై మ్యాపింగ్ జరగాలని తెలిపారు. ఎం.డి.ఓ.లు, మున్సిపల్ కమీషనర్లు, క్లస్టర్లను వెరిఫై చేయాలని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో మ్యాపింగ్ కార్యక్రమం బాగా చేసారని తెలిపారు.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జె.నివాస్, సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు, సమగ్రగిరిజనాభివృధ్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి సాయికాంత్ వర్మ్, సహాయ కలెక్టర్ ఎ.భార్గవతేజ, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, నగరపాలక సంస్థ కమీషనరు జి.గీతాదేవి, రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం.వి.రమణ, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి జి.చక్రధరరావు, జిల్లా పంచాయితీ అధికారి వి. రవికుమార్, జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ, ఎస్.సి.కార్పోరేషన్ ఇ.డి. సి.హెచ్.మహాలక్ష్మి, తదితర అధికారులు హాజరైనారు.
20వ తేదీన గ్రామ సభలు నిర్వహించాలి