20వ తేదీన గవర్నర్ ఇచ్చాపురం రాక

శ్రీకాకుళం : నవంబరు 16 : రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఈ నెల 20వ తేదీన ఇచ్ఛాపురం సందర్శిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె నివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 20వ తేదీ ఉదయం 9 గంటలకు భువనేశ్వర్ నుండి ఇచ్ఛాపురం హెలీకాప్టర్ లో చేరుకుంటారని ఆయన చెప్పారు. హెలీపాడ్ నుండి ఇచ్ఛాపురం ప్రభుత్వ పాఠశాలకు 9 గంటల 10 నిమిషాలకు చేరుకుని 10.30 గంటల వరకు ఉంటారని ఆయన తెలిపారు. పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తారని అనంతరం బయలు దేరి ఒడిషా రాష్ట్రం బ్రహ్మపుర వెళతారని కలెక్టర్ ఈ ప్రకటనలో తెలిపారు.