శ్రీకాకుళం : నవంబరు 1 : రాష్ట్ర ప్రభుత్వం మీడియా నియంత్రణకు విడుదల చేసిన జీవో ని వెంటనే ఉపసంహరించుకోవాలని మీడియా స్వేచ్ఛను హరిస్తే ఊరుకునేది లేదని ఐజేయూ నాయకులు నల్లి ధర్మారావు అన్నారు.రాష్ట్ర దినోత్సవంనాడు మేము ఈ విధంగా నిరసన తెలియజేయడం మాకుకూడా బాధాకరమే అయినప్పటికీ మా మీడియా హక్కులను కాపాడుకోవడం యూనియన్ నాయికులుగా తప్పదన్నారు.రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 2430 కి వ్యతిరేకంగా శ్రీకాకుళం పురవీదుల్లో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో రాష్ట్ర మంత్రి ధర్మాన కృష్ణదాస్ కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా నల్లి ధర్మారావు మాట్లాడుతూ తప్పుడు వార్తలు రాస్తే చర్యలు తీసుకోవడానికి గతంలోనే చట్టాలు ఉండేవని కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ జి ఓ తో పూర్తిగా మీడియా హక్కులను కాలరాయడమే అని అన్నారు 2007లో వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా ఇటువంటి జిఓ నే తీసుకువచ్చారని అప్పటి జర్నలిస్టుల ఆందోళనతో ఈ జీవోను తన తప్పును తెలుసుకొని ఉపసంహరించుకున్నారు. మరి రాజశేఖరరెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి ఇలాంటి జీవులు తేవడం ఏమనుకోవాలి అని ఆయన ప్రశ్నించారు. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఇలాంటి జి.ఓ.ను ప్రభుత్వం తీసుకురావడాన్ని పూర్తిగా ఖండిస్తున్నామని, ఈ జీవోను ఉపసంహరించుకునే వరకు పోరాటం ఆగదని ఆయన తెలిపారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వరరావు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కూన పాపారావు శృంగారం ప్రసాద్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్స్ విశ్వేశ్వర గణపతిరావు,చిన్న పత్రికల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లేశ్వరరావు, సెక్రెటరీ చింతాడ అప్పలనాయుడు,కోశాధికారి సున్నపు చిన్నారావు, కె వి రామారావు, బి శ్యామసుందర్, బి వేణు, గణపతి, చైతన్య, గుణ, పాపారావు, రమేష్, ఆకులమాధవ, కారణం విజయ్ కుమార్,వేణు, సురేష్, గౌరీ శంకర్, కస్పా విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
మీడియా స్వేచ్ఛను హరించే జి.ఓ.నెంబరు2430 ను వెంటనే ఉపసంహరించుకోవాలి: నల్లి ధర్మారావు