రేపు నగరంలో ఇసుక మార్చ్

శ్రీకాకుళం : నవంబరు 12: గృహ నిర్మాణ దారులకు ఇంటి నిర్మానానికి ఇసుక ఉచితంగా అందించి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని,5 నెలలుగా ఇసుక కొరత వలన పనులు లేనందున ప్రతి నిర్మాణ  కార్మికునికి నెలకు10 వేల రూపాయలు చొప్పున్న యివ్వాలని,ప్రస్తుత ఇసుక విదానంలో వెంటనే మార్పులు చేయాలని, వెంటనే ఇసుక రీచ్ లను ప్రారంభించలని కోరుతూ జిల్లాలో వామపక్ష పార్టీలు పిలుపులో బాగంగా రేపు ఉదయం9.30గంటలకు డైమండ్ పార్క్ నుంచి గూజరాతిపేట వరకు ఇసుక మార్చ్ నిర్వహించాబడునని సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎమ్ ఎల్ న్యూడెమోక్రసీ,సిపిఐ ఎమ్ ఎల్  పార్టీల కార్యదర్శులు సనపలనర్సింహులు,బి కృష్ణ మూర్తి, తాండ్ర ప్రకాష్ ,తాండ్ర అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు, గృహ నిర్మాణ దారులు, వామపక్ష పార్టీల కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు.