న్యూడిల్లి : నవంబరు 9 : అయోధ్యపై తుదితీర్పు నేపథ్యంలో మతపరమైన ప్రాంతాల భద్రతకు చర్యలు చేపట్టామని, సోషల్ మీడియా పోస్టులు, వాట్సాప్‌లో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రచారానికి పాల్పడితే జైలు శిక్షతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ వర్గాలు హెచ్చరించాయి. జాతీయ భద్రతా చట్టం(ఎన్‌ఎస్‌ఏ), గ్యాంగ్‌స్టర్ చట్టం కింద అరెస్టు చేసి చర్యలు తీసుకుంటామని నోయిడా గౌతమ్‌బుద్ధ నగర్ జిల్లా మేజి్రస్టేట్ బీఎన్ సింగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చట్టాల ద్వారా నిందితుల ఆస్తులను కూడా స్వాదీనం చేసుకునే వీలుందన్నారు. విభిన్న రకాల ప్రజలు నివసించే ప్రాంతాల్లో శాంతి సమావేశాలు నిర్వహించి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు చెప్పారు.
దేశంలో షోషల్ మీడియాపై నిఘా