శ్రీకాకుళం : నవంబరు 18 : జిల్లాలో పింఛను పొందుతున్న వృద్ధ కళాకారులు ఈ నెల 30లోగా తమ లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించాలని జిల్లా పౌర సంబంధాల అధికారి యల్.రమేశ్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసారు. జిల్లాలో పింఛను పొందుతున్న వృద్ధ కళాకారుల లైఫ్ సర్టిఫికేట్లను ఈ నెల 20వ తేదీలోగా సమర్పించాలని కోరిన సంగతి విదితమే. ఆ గడువును ఈ నెలాఖరు వరకు పెంచినట్లు ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. లైఫ్ సర్టిఫికేట్లు సమర్పించవలసిన వృద్ధ కళాకారులు నవంబరు 30వ తేదీలోగా జిల్లా పౌర సంబంధాల అధికారి వారి కార్యాలయం, సమాచార పౌర సంబంధాల శాఖ, అఫీషియల్ కాలనీ, శ్రీకాకుళం వారికి స్వయంగా సమర్పించాలని అన్నారు. ఇతర వివరాల కొరకు జిల్లా పౌర సంబంధాల అధికారి వారి కార్యాలయ టెలీఫోన్ నెంబర్ 220004కు సంప్రదించవచ్చని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేసారు.
30 వ తేదీ లోగా లైఫ్ సర్టిఫికేట్లు సమర్పించాలి