శ్రీకాకుళం : నవంబరు 23 : నరసన్నపేటలో శనివారం జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ ఏ.కళ్యాణ చక్రవర్తి తెలిపారు. ఈ మేరకు శుక్ర వారం ఒక ప్రకటన విడుదల చేసారు. జాబ్ మేళాను నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో చేపడుతున్నామని పేర్కొన్నారు.ఉదయం 9.30 గంటల నుండి నమోదు, ఎంపిక కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. జాబ్ మేళాలో అపోలో, ఎయిర్ టెల్,అరబిందో, గ్రీన్ టెక్, వికెటి ఫార్మా తదితర దాదాపు 35 కంపెనీలు పాల్గొంటున్నాయని ఆయన చెప్పారు.10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐ.టి.ఐ, డిగ్రీ, ఎం.ఎస్.సి ఆర్గానిక్ కెమిస్ట్రీ విద్యార్హతలు కలిగిన అభ్యర్ధులు ఇందులో పాల్గొనవచ్చని చెప్పారు. ఉపాది జ్యోతి వెబ్ సైట్ లో నమోదు చేసుకున్న 30 వేల మంది అభ్యర్ధుల్లో 5,300 మంది అభ్యర్ధులు ఈ జాబ్ మేళాలో పాల్గొనుటకు అర్హులుగా ఉన్నారని తెలిపారు. జాబ్ మేళాలో ఉద్యోగం పొందే అభ్యర్ధులు శ్రీకాకుళం, విశాఖపట్నం, హైదరాబాదులలో ఉద్యోగం చేయాల్సి ఉంటుందని చెప్పారు. అర్హతలు కలిగిన అభ్యర్ధులు ఇందులో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్, జిల్లా కలెక్టర్ జె నివాస్ జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన చెప్పారు.
నేడు జాబ్ మేళా