ఉల్లిపై ఊరట

తెనాలి : నవంబరు 18 : ఉల్లి కొరతను తీర్చేందుకు రెండు రోజుల్లో రాష్ట్రంలోని అన్ని రైతుబజార్లలో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర పశు సంవర్థక, మార్కెటింగ్‌శాఖల మంత్రి మోపిదేవి వెంకట రమణారావు చెప్పారు.వ్యాపారులెవరైనా అక్రమంగా సరకును నిల్వచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతుబజార్లలో కిలో ఉల్లిపాయలను 25 నుంచి 30 రూపాయల లోపు విక్రయించే ఏర్పాట్లు   చేస్తున్నట్లు తెనాలిలో చెప్పారు.