తెలుగు రాష్ట్రంలో తెలుగు భాషకు ముప్పు ఏర్పడితే ప్రజలు చూస్తూ ఊరుకోరు : సి.పి.ఐ.రాష్ట్ర కార్యదర్శి

అమరావతి : నవంబరు 8 : ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలోనే బోధించాలన్న ప్రభుత్వ ఉత్తర్వును రాజకీయ, ప్రజాసంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు ముక్తకంఠంతో ఖండించాయి. ప్రభుత్వం జీవోను ఉపసంహరించుకోకపోతే తెలుగు భాష ఉనికి ప్రశ్నార్థకమవుతుందని భారత కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ) రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశాయి.తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ మొదలైన రాష్ట్రాలలో తెలుగు మాధ్యమ పాఠశాలలున్నాయి. పుట్టినిల్లయిన మన రాష్ట్రంలో తెలుగు మీడియం లేకుండా చేయడమేంటి అని ప్రశ్నించారు. దీనిపై ఈనెల 9న ఉపాధ్యాయ సంఘాలు,మేధావులు, పట్టభద్ర ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహిస్తాం అని అన్నారు.