శ్రీకాకుళం : నవంబరు 10 : భారతరత్న మౌలానా అబుల్ కలాం అజాద్ 132వ జయంతి వేడుకలను సోమ వారం ఉదయం 10 గంటల నుండి శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళామందిర్ లో నిర్వహిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎం.అన్నపూర్ణమ్మ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్, జిల్లా కలెక్టర్ జె.నివాస్ మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నట్లు ఆమె ఈ ప్రకటనలో తెలిపారు.
రేపే మైనారిటీ సంక్షేమ దినోత్సవం