శ్రీకాకుళం : నవంబర్ 5: గార మండలం శ్రీకూర్మంలోని శ్రీకూర్మనాధుని తెప్పొత్సవం ఈ నెల 9వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ .విజయకుమార్ పేర్కొన్నారు.ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసారు. కార్తీక క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా నవంబరు 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఆలయం ఎదురుగా ఉన్న పుష్కరిణిలో స్వామివారి తెప్పోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కావున ఈ తెప్పోత్సవ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయవలసినదిగా ఆయన ఆ ప్రకటనలో వివరించారు.
9వ తేదీన కూర్మనాధుని తెప్పోత్సవం