గుంటూరు : నవంబరు 9 : గతంలో ఎన్నడూ లేనివిధంగా మార్కెట్‌లో గుంటూరు మిర్చి రేటు దుమ్ము రేపుతోంది. మిర్చి మార్కెట్‌లో నిన్న మేలు రకం రికార్డు స్థాయిలో క్వింటా రూ.19,500ల ధర పలికింది. ఇప్పటికే రైతులు విక్రయించిన పంటను మినహాయిస్తే శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసిన వారికి మంచి లాభాల పంట పండనుంది. ఎర్ర బంగారంగా పిలుచుకునే గుంటూరు మిర్చిని గతేడాది తక్కువ సాగు చేయగా చైనా, థాయిలాండ్ నుంచి ప్రస్తుతం భారీగా ఆర్డర్లు రావడంతో మిర్చి ఘాటు రేటు అధరహో అనిపిస్తుంది.
గుంటూరు ఎర్రబంగారం పైపైకి...