శ్రీకాకుళం : నవంబరు 28 : ఇన్ టాక్ అధ్వర్యంలో నవంబరు 24వ తేదీ నుండి నిర్వహించ బడుచున్న ప్రపంచ వారసత్వ వారోత్సవాలు సందర్భంగా 5వ రోజయిన గురువారం ఉదయం స్థానికి మున్సిపల్ ఆఫీసు పక్కన గల కె.ఎస్. ఆర్. బాలికల జానియర్ కళాశాల వద్ద పురాతన కళాసంపద పై అవగాహన సదస్సును కవి, సీనియర్ రచయిత కంబదురి షేక్ నబిరసూల్ సభా అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి డా. అప్పిరెడ్డి హరినాధరెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన సంస్కృతి కళలకు శ్రీకాకుళం జిల్లా నిలయమని అన్నారు. వారసత్వ సంపద పరిరక్షణ తప్పనిసరి అన్నారు. వీటిని భావితరాలు వారికి అందించవసిన భాద్యత మనందరిపైన ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కె.ఎస్.ఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కె. సుబధ్ర ఇన్ టాక్ కన్వినర్ కె.వి. రాధాప్రసాద్, విద్యార్దిని విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ వారసత్వ వారోత్సవాలు