రహదారులు భవనాల శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష

అమరావతి : నవంబరు 4 :ఈ రోజు రహదారులు భవనాల శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు.అందులో  శ్రీకాకుళం జిల్లాకు సంబందించిన అంశాలు ముఖ్యంగా నూతన కలక్టరేట్ నిర్మాణం వేగవంతం చేయాలని అలాగే జిల్లాలో ప్రధానంగా రైల్వే స్టేషన్ కు రద్దీ పెరగినందువలన ఆమదాలవలస నుండి  శ్రీకాకుళం వరకు రెండు లైన్ల రోడ్డు నిర్మాణం అవసరం గురించి వివరించారు.అలాగే వంశదార నదిపైకొమనాపల్లి వంతెన పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని వివరించారు.అలాగే ఈ మధ్య వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న ఉత్తరాంధ్ర జిల్లాలలో రోడ్ల పై కూడా ప్రస్తావించినట్లు విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది.