శ్రీకాకుళం : నవంబరు 29 : రాష్ట్రంలో అమలు చేస్తున్న నవశకం సర్వే సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అన్నారు. నవశకంపై జిల్లా కలెక్టర్లతో ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్సును శుక్రవారం నిర్వహించారు. నవశకం సర్వే నిర్ధేశిత సమయంలో పూర్తి చేయాలని డేటా వెంటనే తాజా పరచాలని అన్నారు. డేటా ఎంట్రీ వేగవంతం చేయాలని ఆదేశించారు. సచివాలయ ఉద్యోగుల ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలని ఆదేశించారు. సచివాలయ భవనాలు ఏర్పాటు చేసి ఇంటర్నెట్ కంప్యూటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉగాది నాటికి ఇళ్ళ స్ధలాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. భూసేకరణ అవసరాలను గుర్తించాలని అన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, రెవిన్యూ డివిజనల్ అధికారి ఎం.వి.రమణ, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరక్టర్ ఏ.కళ్యాణ చక్రవర్తి, జిల్లా పంచాయతీ అధికారి వి.రవి కుమార్, జిల్లా నీటియాజమాన్య సంస్ధ ఏపిడి పి.రాధ తదితరులు పాల్గొన్నారు.
నిర్ధేశిత సమయంలో నవశకం సర్వే పూర్తి చేయాలి