అక్కుపల్లి మరో అరసవల్లి

వజ్రపుకొత్తూరు :నవంబరు 10: అక్కుపల్లి శివసాగర్‌ బీచ్‌  ఇసుక తిన్నెలు, పర్యాటకులను ఎంతగానో ఆకర్షించే ప్రకృతి ఆహ్లాదంగా ఉంటుంది.ఇక్కడ  250 ఏళ్ల చరిత్ర కలిగిన నీలకంఠేశ్వర ఆలయం ఉద్దాన ప్రాంత ప్రజల ఇలవేల్పుగా భాసిల్లుతోంది.పర్యాటకులు సైతం స్వామివారి అనుగ్రహం పొందుతున్నారు. ఇక్కడ స్వామివారి ఆలయ నిర్మాణం పూర్వకాలంలో మోట్టూరు గ్రామస్తుడు మద్దిల కుటుంబానికి చెందిన నువ్వల వ్యాపారి కలలోకి వచ్చి  స్వామివారు  అక్కడ బీచ్‌ పరిసరాల్లోని ఇసుక దిబ్బలో తాను వెలసినట్లు, అక్కడ గుడి కట్టాలని ఆజ్ఞాపించారట.ఆ విధంగా వెళ్లి ఆ వ్యాపారి వెళ్ళి చూడగా శివలింగం కనిపించిందంట. స్వామివారు ఆజ్ఞ పాటించడంతో ఆయన వ్యాపారం లాభసాటిగా సాగిందట. అప్పటి నుంచి ఈ ప్రాంత వాసులు స్వామివారిని కొలుస్తున్నారు.ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. అరసవల్లి సూర్యనారాయణ స్వామి  ఆలయంలో మాదిరిగా సూర్యకిరణాలు శివలింగంపై పడుతుంటాయి. ఆ సమయంలో దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. మహా శివరాత్రి,అలాగే ప్రత్యేక దినాల్లో అక్కుపల్లి, బైపల్లి, చినవంక, బాతుపురం గ్రామస్తుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మహాశివరాత్రి మొదలగు పర్వదినాలలో ఉంటాయి.