శ్రీకాకుళం : నవంబరు 25 : ఫిజియో థెరపీద్వారా వివిద రకాల శాశ్వత, తాత్కాలిక శారీకర వైకల్యాలు మస్థిస్కపక్షవాతం వంటి దీర్ఘకాలిక నాటీ సంబంధిత రుగ్మతలు నుండి శాశ్వత పరిష్కారం లభిస్తుందని సమగ్ర శిక్షాబియాన్ ఐ.ఇ.సి.ఓ, ఎ. సంజీవరావు అన్నారు. సోమవారం ఉదయం భవిత కేంద్రములో దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులకు ఫిజియో థెరఫీ సేవలుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమమునకు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిజియోథెరపీ చికిత్సను సహిత విద్యలో ఒక భాగం చేయడం ద్వారా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఎంతగానో ఉపయోగ పడుతుతందని అన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో ఎక్కువ శాతం మస్థిష్క వక్షవాతం శారీరక వైకల్యాలు, వివిధ రకాల ధీర్గకాలిక నాడీ సంబంధిత రుగ్మతలు గల పిల్లలు ఉన్నారని తెలిపారు. ఇటువంటి పిల్లలు తమ దైనందిన కార్యక్రమాలను స్వయంగా చేసుకోలేక మంచానికే పరిమితం అవుతుంటారని చెప్పారు. ఫిజియోథెరఫీ చికిత్స ద్వారా ఇటువంటి పిల్లలు వైకల్యం నుండి ఉపశయంన కలిగి దైనందిన కార్యక్రమాలు వారే చేసుకొనేలా చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిపుణులైన ఫిజియోథెరఫిస్టు డా. బి. రాజేంద్రప్రసాద్, ఎమ్.ఇ.ఓ జి. క్రిష్టారావు, సమగ్ర శిక్షాభియాన్ ఎ.ఎల్.ఎస్. సి.ఓ జి. లక్ష్మణరావు, సహాయో ఎ.ఎల్.ఎస్. సి.ఓ డి. గోవిందరావు, ఐ.ఆర్.టి.ఎస్ బి. కుసుమ కుమారి, యు. చెల్లమ్మ, దివ్యాంగులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
ఫిజియో థెరఫీ ద్వారా వివిధ వ్యాధులకు శాస్వత పరిష్కారం