శాసన సభ్యులు పార్టీ మారాలంటే రాజీనామా చేయాలి: స్పీకర్ తమ్మినేని

ఢిల్లీ : నవంబరు 16 : ఎమ్మెల్యే పార్టీ మారాలంటే తప్పనిసరిగా రాజీనామా చేయాల్సిందేనని ఆంధ్రప్రదేశ్‌ శాసన సభాపతి తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. సాంకేతికతపై సభాపతుల సబ్‌ కమిటీ భేటీలో తమ్మినేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ రాజీనామా చేయకుండా శాసన సభ్యులు పార్టీ మారితే చర్యలు తప్పవన్నారు. సభా నాయకుడిగా సీఎం కూడా ఇదే చెప్పారని, దానికే కట్టుబడి ఉన్నానని చెప్పారు. వల్లభనేని వంశీ వైకాపాలో చేరాలంటే తన పదవికి రాజీనామా చేయాల్సిందేనని తమ్మినేని తెలిపారు.