శ్రీకాకుళం : నవంబరు 15 : జిల్లాలో పర్యాటక ప్రదేశాల్లో వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పర్యాటక ప్రగతపై జిల్లా కలెక్టర్ నివాస్ శుక్రవారం సమీక్షించారు. పర్యాటక ప్రదేశాలలో మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. వాటర్ ఫాల్స్ ప్రదేశాల్లో మరిన్ని చర్యలు చేపట్టాలని, వాటర్ ఫాల్స్ వద్దకు వెళ్లిన పర్యాటకులు తిరిగి స్నానాలు చేసే అవకాశం ఉంటుందని పేర్కొంటూ స్నానాలు ఆచరించుటకు అనువుగా పరిశుభ్రంగా స్నానపు గదులు ఉండాలని అన్నారు. మరుగుదొడ్లు,పారిశుద్ధ్యం చక్కగా ఉండాలని అన్నారు. జిల్లాలో జరుగుతున్న పర్యాటక పనులు వేగవంతం కావాలని పర్యాటక అధికారులను ఆదేశించారు. గత మూడు సంవత్సరాల కాలంలో పర్యాటక పనులు త్వరగా పూర్తి కాకపోవడంపై ప్రశ్నించారు.సంతకవిటి మండలం గుళ్ళసీతారాం పురంలో సీతారాముల ఆలయానికి రూ.40 లక్షలతో మంజూరు చేసిన పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. శివసాగర్ బీచ్ పనులు, గిరిజన మ్యూజియం డిసెంబరు 15 నాటికి పూర్తి చేయాలని అన్నారు. పొన్నాడ గుట్టపై శిల్పారామం పనులు త్వరగా చేపట్టాలని లేదంటే భూ కేటాయింపు రద్దు చేస్తామని పేర్కొన్నారు.
పర్యాటక కేంద్రాలలో వసతులు నిర్మించాలి