హైదరాబాదు : నవంబరు 2: పత్రికా స్వేచ్చకు భంగం కలిగించే జీవో2430ని జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(ఏపియుడబ్ల్యుజె)కు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. ఈ జీవోను తక్షణమే రద్దు చేయాలని టీయుడబ్ల్యుజె సలహాదారు, పిసిఐ మాజీ సభ్యులు కె.శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ, పిసిఐ మాజీ సభ్యులు కె.అమర్ నాథ్ ఐజేయు కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, లు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మీడియా సంస్థలను, అందులో పనిచేస్తున్న జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఇలాంటి జీవోలతో గత ప్రభుత్వం చేసిన తప్పులను సవరించాల్సింది పోయి, చర్యలు తీసుకునే అధికారాన్ని వివిధ శాఖల ఉన్నతాధికారులకు కట్టబెట్టడం సహించారనిదని వారు ధ్వజమెత్తారు. భావ ప్రకటన స్వేచ్చకు భంగం కలిగించే ఎలాంటి చర్యనైనా తమ సంఘం ప్రతిఘటిస్తుందని వారు స్పష్టం చేశారు.
మీ పోరాటానికి మేము మద్దతిస్తాం టి.యు.డబ్ల్యు.జె.