శ్రీకాకుళం : నవంబరు 15 : నైర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎన్.ఎస్.ఎస్. విభాగం శ్రీకాకుళం రూరల్ మండలం తండ్యాంవలస గ్రామంలో ఏర్పాటు చేస్తున్నట్టు అసోసియోట్ డీన్ డా..ఎ.వి. రమణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16 నుండి 22 తేది వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసామన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు మరియు వ్యవసాయ కళాశాల విద్యార్ధులు పాల్గొంటారన్నారు. 16 వ తేదిన స్వచ్చంద సేవకులు మరియు ఆహ్వానితుల ఆధ్వర్యంలో గ్రామీణ సామాజిక మరియు ఆర్ధిక పరిస్ధితులు నిర్వహిస్తామన్నారు. 17వ తేదిన స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని స్వచ్చంద సేవకులు, నైర కళాశాల వారు నిర్వహిస్తామన్నారు. 18వ తేదిన జెమ్స్ ఆసుపత్రి రాగోలు ఆధ్వర్యంలో వైధ్య శిబిరాన్ని నిర్వహిస్తారని తెలిపారు. 19వ తేదిన పశు వైద్య శిబిరాన్ని శ్రీకాకుళ పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. 20వ తేదిన భూసార పరీక్ష ప్రయోగశాల ఆమదాలవలస మరియు నైర వ్యవసాయ కళాశాల సంయుక్తంగా భూసార పరిక్ష, వ్యవసాయ క్షేత్ర సందర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. 21వ తేదిన శ్రీకాకుళం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ యాంత్రీకరణ కార్యక్రమం మరియు ఎ.బి.ఐ.ఆర్డీ. శ్రీకాకుళం ఆధ్వర్యంలో యువతకు ప్రభుత్వ అభివృద్ధి పధకాలు మరియు స్వయం ఉపాధీ పథకాలపై అవగాహన సదస్సు నిర్వహిస్తామన్నారు. 22వ తేదిన నైర వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో రబీ పంటలకు మేలైన సాగు యాజమాన్య పద్దతులపై కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆ ప్రకటన తెలిపారు.
తండ్యాంవలసలో యన్.యస్.యస్.శిభిరం