శ్రీకాకుళం : నవంబరు 2 : గ్రామ, వార్డు సచివాలయాలలో మిగిలిన పోస్టులకు ఆదివారం నియామక పత్రాలను అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె. నివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయంలో వివిధ శాఖలకు సంబంధించిన పోస్టులకు ఆదివారం ధృవపత్రాల పరిశీలన జరుగుతుందని అన్నారు. ధృవపత్రాల పరిశీలన పూర్తి అయిన వెంటనే అర్హులైన అందరికి వెంటనే నియామక పత్రాలను అందజేయడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. ధృవపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్ధులకు మోబైల్ ఫోన్ నంబరుకు మెసేజ్ వస్తుందని, సంబంధిత వెబ్ సైట్ లో జాబితాను పెట్టడం జరుగుతుందని దానిని అభ్యర్ధులు పరిశీలించుకోవాలని ఆయన కోరారు. మెసేజ్, కాల్ లెటర్ లో ధృవపత్రాల పరిశీలనా కేంద్రం వివరాలు, సమర్పించాల్సిన ధృవపత్రాల వివరాలను పొందుపరచడం జరుగుతుందని ఆయన చెప్పారు. కాల్ లెటర్ సమాచారం అందిన అభ్యర్ధులు అందరూ ఆది వారం హాజరు కావచ్చని కలెక్టర్ స్పష్టం చేసారు.
రేపు వార్డు/సచివాలయం మిగిలిన పోస్టులకు నియామక పత్రాలు జారీ :కలెక్టరు :జె.నివాస్