కంచిలి : నవంబరు 4 : స్థానిక తహసీల్దారు ఆఫీసు వద్ద మండలంలో నివసించే గొండు కులస్థులతో భారత కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ) అద్వైర్యంలో నేడు ధర్నా చేశారు.వారి కులాన్ని ప్రభుత్వం గుర్తించి కుల దృవీకరణ పత్రాలు జారీ చేయాలని కోరుతున్నాను. కులదృవీకరణ లేకపోవడం వలన వారి పిల్లలు చదువులు అలాగే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకాలు వీరికి చేరడం లేదని సమాజంలో బలహీన వర్గాల వారైన వీరి కులాన్ని ప్రభుత్వం వెంటనే గుర్తించి కుల దృవీకరణ పత్రాలను అందించాలని సి.పి.ఐ. సీనియర్ నాయకులు,వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చాపర సుందరలాల్ కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు లండ వెంకటరావు మాట్లాడుతూ ఈ సమస్యను పలుమార్లు ప్రభుత్వ అధికారుల దృష్టికి తెచ్చినా ఇంతవరకు స్ఫందించలేదని గిరిజనలైన వీరి కులాన్ని గుర్తించి కులదృవీకరణ పత్రాలను అందించే విధంగా చర్యలు తీసుకొని వీరిని ఆదుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు నారాయణస్వామి, హరికృష్ణ మరియు అధిక సంఖ్యలో గిరిజన గొండుకుల ప్రజలు పాల్గొన్నారు.
గొండు కులస్తులకు కుల దృవీకరణ పత్రాలివ్వాలి : చాపర సుందదలాల్