వసతి గృహాలన్నీ మోడల్ హోస్టల్స్ గా తీర్చిదిద్దాలి : జిల్లా కలెక్టర్ జె. నివాస్.

శ్రీకాకుళం : నవంబరు 30 : జిల్లాలో వసతిగృహాలు మోడల్ హోస్టల్స్ గా తీర్చి దిద్దాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారుకు చూచించారు. శనివారం సాయంత్రం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మార్పు కార్యక్రమమునకు సంబంధించి ఇంజనీరింగ్ అధికారులు, స్కూల్ హెడ్ మాష్టార్స్, హోస్టస్ వెల్ఫేర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాలు, పాఠశాల్లో మౌళిక వసతులు కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. వసతిగృహాల్లో చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి, వాటి వల్ల విద్యార్ధులు ఇబ్బందులు పడకుండా వెంటే వాటిని సరిచేయాలని చెప్పారు.        పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బి, ఎపిఎస్ఐడిసి ఇంజనీరింగ్ డిపార్ట్ మెంటు ఎ.ఇ. లకు ఒక్కో హోస్టల్ చొప్పున అప్పగించడం జరిగిందని చెప్పారు. ప్రతి ఒక్కరూ వసతిగృహాలను సందర్శించి పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించాలని చెప్పారు. పిల్లలతో సంభాషిస్తూ వారికి చదువు పట్ల ఉత్సాహం కల్పించాలని చెప్పారు. ప్రతి పసతిగృహంను పరిశుభ్రముగా ఉంచుట, తాగు నీరు సౌరక్యం, లైబ్రరీ, గార్డెన్ ఏర్పాటు,  వంటివి చేపట్టడంవలన పిల్లలకు చదవుపట్ల ఉత్సాహం కలుగుతందిని చెప్పారు.ఈ ఏడాది నుండి 10వ తరగతి పరీక్షలు మల్టిపుల్ పద్దతిలో నిర్వహించ నున్నందున విద్ద్యార్ధులకు ఇప్పిటి నుండే మంచి శిక్షణ ఇవ్వాలని చెప్పారు. వారిలో ఉన్న భయాన్ని పోగొట్టాలని అన్నారు. వసతి గృహాలు, పాఠశాలలు మరమ్మత్తులకు మంజూరు చేసిన పనులు టెండర్లు ఖరారు చేసి త్వరితగతిన ప్రారంబించాలని అదేశించారు. ఈ సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ వసతి గృహాల అభివృద్ధి కమిటీ ప్రత్యేక అధికారి పి. రజనీకాంతరావు, సాంఘిక సంక్షేమ శాఖ డి.డి అదిత్యలక్ష్మీ, ఇంజనీరింగ్ శాఖల డి.ఇ.లు, ఎ.ఇ.లు, హెచ్.ఎం.లు, హోస్టల్ వెల్ఫేర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.