అగనంపూడి : నవంబరు 10: విశాఖ జిల్లాలోని దువ్వాడ రైల్వే స్టేషన్‌లో రైలు దిగుతుండగా ప్రమాదవశాత్తు జారిపడి దంపతులు మృతి చెందారు. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.విజయనగరం జిల్లా గరివిడి మండల వెదుళ్లవలస గ్రామానికి చెందిన కె.వెంకటరమణారావు(40), మణి(35) దంపతులు శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్తున్న ప్రత్యేక రైళ్లో స్వగ్రామానికి పయనమయ్యారు. ఆదివారం తెల్లవారుజామున దువ్వాడ స్టేషన్‌కు చేరుకున్నారు. దువ్వాడలో వెంకటరమణ భార్య మణి తల్లిదండ్రులు ఉండటంతో అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో నాలుగోనెంబరు ప్లాట్‌ఫాం వద్ద దిగేందుకు ప్రయత్నించి ప్రమాదవశాత్తు పట్టాలపై జారిపడి ప్రాణాలు కోల్పోయారు.
రైలు దిగుతూ దంపతులు మృతి