వ్యాయామం వలన మదుమేహం అదుపులో ఉంటుంది .

శ్రీకాకుళం : నవంబర్ 14 : మధుమేహం ఉన్న వారు  ప్రతి రోజు కనీసం 45 నిమిషాలు వ్యాయామం మరియు వాకింగ్  చేయడం వల్ల మధుమేహన్ని   నియంత్రిoచవచ్చని  రెడ్ క్రాస్ ఛైర్మన్ పి.జగన్మోహన్ రావు అన్నారు. గురువారం మధుమేహం దినోత్సవం మరియు అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా  ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ అధ్యర్యంలో స్థానిక పాత బస్టాంండు వద్ద ఉన్న  రెడ్ క్రాస్ లో ఏర్పాటు చేసిన మెగా  వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శారీరక శ్రమ , నమయపాలన లేకుండా ఆహారం తీసుకోవడం  సరైన నిద్ర లేకపోవడం వల్ల ఈ మధుమేహం వస్తుందన్నారు. దీనిని నియంత్రించడానికి సమయానికి మితంగా ఆహారాన్ని తీసుకోవడం , సమయానికి నిద్ర పోవడం వల్ల  మరియు  ప్రతి రోజు క్రమం తప్పకుండా శారీరక శ్రమ అవసరం అన్నారు. అలాగే  బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని  దానిలో ఆకు కూరలు తప్పకుండా తీసుకోవాలని ఆయన సూచించారు. ఐరన్ మరియు పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు రావని అన్నారు. డ్రై ఫ్రూట్స్ మరియు నట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల  శరీరానికి అవసరమైన రక్తం చేకూరుతుందని ఆయన తెలిపారు. ఎప్పటికప్పుడు  రక్త పరీక్షలు చేయించుకోవాలని  ఆయన సూచించారు. వైద్య శిబిరంలో  డాక్టర్లు  వైద్యపరీక్షలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ సభ్యులు   కళ్యాణ్,శివ,లక్ష్మణ్  మరియు  రెడ్ క్రాస్ ప్రతినిధులు పెంకి చైతన్య , సత్యనారాయణ, సతీష్,కోటేశ్వరరావు మరియు డాక్టర్ కెల్లి చినబాబు , దుబ్బ రాకేష్ ,మూల వెంకట్రావు, వి.దినేష్ కాంత్  తదితరులు  పాల్గొన్నారు.