విశాఖపట్నం, నవంబరు 12 : భారతదేశంలో తొలిసారిగా త్రివిధ దళాలతో కలిసి అమెరికా రక్షణ దళం విన్యాసాలు నిర్వహించబోతోంది. ఈ నెల 13 నుంచి 21 వరకు విశాఖపట్నం, కాకినాడ సముద్ర తీరాల్లో ఈ రెండు దేశాలు సంయుక్తంగా వివిధ విన్యాసాలకు సిద్ధమయ్యాయి. వీటికి 'టైగర్ ట్రైయంఫ్' అని నామకరణం చేశారు. ఇందులో భారత్ తరఫున ఆర్మీ, నేవీ, వైమానిక దళాలకు చెందిన 1,200 మంది, అమెరికా తరఫున మెరైన్, ఎయిర్‌మెన్, సెయిలర్లు 500 మంది పాల్గొంటున్నారు. తొమ్మిది రోజులు జరిగే ఈ విన్యాసాల ప్రధాన లక్ష్యం.ఒకరికొకరు సహకరించుకోవడం, సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చిపుచ్చుకోవడం. తద్వారా ఇరు దేశాలు సామర్థ్యాలను పెంచుకోవడమని తూర్పు నౌకాదళం వర్గాలు పేర్కొన్నాయి.
రేపటి నుంచి నేవీ విన్యాసాలు