శ్రీకాకుళం : నవంబరు 8: యువతలో దేశభక్తితో కూడిన జాతినిర్మాణం అనే భావన పెంపొందించుటకు భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడలు మంత్రిత్వశాఖ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నెహ్రూ యువ కేంద్రం వద్ద వక్తృత్వ పోటీలు నిర్వహించినట్టు జిల్లా యూత్ కోఆర్డినేటర్ యస్. శివప్రసాద్ రెడ్డి ఒక ప్రకటన ద్వారా తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న సెట్ శ్రీ సి.ఇ.ఓ జి. శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశ భక్తి జాతి నిర్మాణం అనే అంశంపై హిందీ, ఇంగ్లీసు భాషల్లో యువత 8 నిమిషాలు నుండి 10 నిమిషాలు లోపు మాట్లాడాలని అన్నారు. దీనివల్ల యువతలో నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ పేరుగుతాయని చెప్పారు. వక్తృత్వ పోటీలో జిల్లా స్థాయిలో మొదటి బహుమతి గెలుపొందిన వారికి రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్థామని తెలియజేశారు. పోటీలో మొదటి బహుమతి గెలుపొందిన కోటబొమ్మాళికి చెందిన కె. కుసుమ శ్రీపావనికి 5,000 రూపాయిలు నగదు, రెండవ బహుమతి పొందిన బొంతు గ్రామానికి చెందిన బి. మానస కు 2,000 రూపాయలు నగదు, మూడవ బహుమతి పొందిన కొత్తూరు గ్రామానికి చెందిన బి. ప్రియాంక కు రూ. 1,000 రూపాయలు నగదును అందజేశారు. న్యాయ నిర్ణేతలుగా వి. జగన్నాధం నాయుడు, లెప్టెనెంట్ డా. యాళ్ళ పోలినాయుడు, ఎన్.సి.సి. అధికారి, కొమ్ము రమణమూర్తి స్వచ్చంద సంస్థ ప్రతినిధి వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారి ఎన్. నారాయణరావు,బి. శ్రీనివాసరావు, ఎన్.వై.కె. గణాంకాధికారి డి. శ్రీనివాసరావు, సత్యన్నారాయణ, యువకులు, వాలంటీర్లు పాల్గొన్నారు.
యువతను ప్రోత్సహిస్తున్న నెహ్రూ యువ కేంద్రం