యూనిట్లు ప్రారంభానికి చర్యలు తీసుకోవాలి

శ్రీకాకుళం : నవంబరు 12 స్వయం సహాయక యూనిట్ల ప్రారంభానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ నివాస్ బ్యాంకర్లతో సమీక్షించారు. బి.సి, ఎస్.సి తదితర కార్పొరేషన్ల ద్వారా అమలు చేస్తున్న స్వయం సహాయక యూనిట్లను త్వరగా ప్రారంభించుటకు చర్యలు చేపట్టాలన్నారు. 2016-17, 2017-18, 2018-19 సంవత్సరాలకు సంబంధించిన యూనిట్లకు వెంటనే బ్యాంక్ రుణం మంజూరు చేసి యూనిట్లు తక్షణం ప్రారంభించి లబ్దిదారులకు ప్రయోజనం కలిగించాలని పేర్కొన్నారు. ఇందుకుగాను రోజువారీ లక్ష్యాలను నిర్ణయించుకోవాలని అన్నారు. బ్యాంకు శాఖల స్పందించాలని అన్నారు. వ్యవసాయానికి అందించిన సహకారాన్ని యూనిట్లను నెలకొల్పుటకు బ్యాంకులు సహకరించాలని కోరారు. డిసిసిబి వద్ద ఎక్కువ పెండింగ్ ఉన్నాయి. ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. ఏపిజివిబి కూడా పెండింగ్ తగ్గించాలని చెప్పారు. జలుమూరు మండలం అల్లాడ ఐఓబి శాఖ పనితీరు మెరుగుపడాలి. ఉన్నత అధికారులకు తెలియజేయాలని ఎల్.డి.ఎంను ఆదేశించారు. అవసరం మేరకు యూనిట్లనుపై అధికారుల ఆదేశాలకు అనుగుణంగా మార్పు చేయాలని సూచించారు. వారం రోజుల్లో రెండు వేల యూనిట్లను ప్రారంభించుటకు సహకరించాలని కోరారు. రైతు భరోసా వివరాలను సక్రమంగా పరిశీలించి చేపట్టాలని సూచించారు.