హైదరాబాద్ : నవంబరు 17: తెలంగాణలో భారీగా తహశీల్దార్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 378 మంది తహశీల్దార్‌లను బదిలీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బదిలీ అయిన వారిని తిరిగి వారి స్థానాలకు పంపుతూ రాష్ట్ర రెవెన్యూ శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా తమను బదిలీ చేయాలంటూ గత కొంత కాలంగా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైన నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
తెలంగాణాలో తహసీల్దారు బదిలీల పండుగ