అవినీతి జరిగితే ఈ తోల్ ప్రీ నెంబరుకు ఫోన్ చేయండి

బుట్టాయగూడెం : నవంబరు 15: గిరిజన సంక్షేమశాఖ, జీసీసీ, గురుకుల, ట్రైకార్‌, ఇంజినీరింగ్‌ తదితర విభాగాల్లో అవినీతి, అధికారుల అలసత్వాన్ని అరికట్టేందుకు టోల్‌ఫ్రీ నంబరు ప్రవేశపెట్టినట్లు ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి తెలిపారు. గురువారం పశ్చిమగోదావరిజిల్లాలోని బూసరాజుపల్లి గిరిజన గురుకుల బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. టోల్‌ ఫ్రీ నంబరు 1800 599 1111ను ఆవిష్కరించారు. విద్యార్థులు తమ సమస్యలను ఈ నంబరుకు ఫోన్‌ చేసి ఏ సమయంలోనైనా తెలపవచ్చన్నారు.