శ్రీకాకుళం : నవంబరు 7: అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం అండగా వుందని రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. గురువారం స్ధానిక ఆనందమయి కళ్యాణమండపంలో అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి స్పీకర్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అగ్రిగోల్డ్ బాధితులు తమిళనాడు, ఒరిస్సా, కర్ణాటక, కోల్ కత్తా,ఛత్తీస్ ఘడ్ తదితర రాష్టాలలో వున్నారని చెప్పారు. కాని ఏ రాష్ట్రంలోను లేని విధంగా మన రాష్ట్రంలోనే బాధితులను ఆదుకోవడం జరుగుతున్నదని తెలిపారు. బిడ్డల చదువుకోసం, వారి భవిష్యత్తుకోసం పైసా పైసాగా కూడబెట్టిన సొమ్మును అగ్రగోల్డ్ లో పెట్టుబడి పెట్టి మోసపోయిన వారిని ముఖ్యమంత్రి ఆదుకోవడం అధ్బుతమైన విషయమని అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వై.ఎస్.కుటుంబానికే చెల్లిందని, ఆయన పాదయాత్రలో బాధితుల కష్టాలను తీర్చుతామని మాట ఇచ్చారని, రాష్ట్రం ఎన్ని ఇబ్బందులలో వున్నా, లెక్కచేయకుండా యిచ్చిన మాటను నిలబెట్టుకున్నారని చెప్పారు. మొదటి విడతగా, రూ.10 వేల కంటే తక్కువ డిపోజిట్ చేసిన 3,69,655 మంది బాధితులకు రూ.265 కోట్లు విడుదల చేయడం జరుతున్నదన్నారు. జిల్లాలోని 45 వేల 834 మంది అగ్రిగోల్డ్ బాధితులకు రూ.31.41 కోట్లు నేరుగా వారి వ్యక్తిగత ఖాతాలకు ఆన్ లైన్లో జమ చేయడం జరుగుతుందని చెప్పారు. వారి వ్యక్తిగత ఖాతాలకు రూ.10 వేలు జమ కాబడుతుందన్నారు. ఇంకా మిగిలిన వారికి రెండన విడతలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు బ్యాంకులలో డిపోజిట్ చేసుకోవాలని హితవు పలికారు.ప్రజలకు సేవ చేసే అధికారులపై దాడులు చేయడం అమానుషమైన చర్యలు అని ఇటువంటి చర్యలను ప్రోత్సహించవద్దని చెప్పారు.గ్రామ సచివాలయాల ఏర్పాటు ద్వారా గ్రామాలు బలోపేతం అవుతాయన్నారు. రహదారులు, భవనాల శాఖామాత్యులు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ,ఎన్నో ఇబ్బందులు పడి దాచుకున్న సొమ్మును అగ్రగోల్డ్ లో డిపోజిట్ చేసి మోసపోయిన ప్రజలకు సి.ఎం. సాయం అందిస్తున్నారని అన్నారు. వివిధ దశలలో సంక్షేమ కార్యక్రమాలను సి.ఎం. అందిస్తున్నారన్నారు. బ్యాంకులలోను, చట్టబధ్ధత గల సంస్ధలలో మాత్రమే సేవింగ్స్ చేసుకోవాలన్నారు. ప్రజలకు విద్య, వైద్యం, వంటి సంక్షేమ పథకాలను అందిస్తున్నదన్నారు.సి.ఎం. యువతకు ఉద్యోగాల కల్పన, రైతులకు భరోసా, మహిళా రిజర్వేషన్, 75 శాతం స్ధానికులకు పరిశ్రమలలో ఉద్యోగాలు వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. అధికారులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు సహకారంతో పనిచేయాలన్నారు. జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ, ప్రజలు మోసపూరిత మాటలను నమ్మరాదని అన్నారు. మోసపోయిన బాధుతులకు ప్రభుత్వం డబ్బులు చెల్లించే ప్రక్రియ ఇదే ప్రధమమని అన్నారు. బాధితులకు సి.ఎం. అండగా వుండడం హర్షణీయమన్నారు.కార్యక్రమంలో బాధితులు మాట్లాడారు. ముఖ్యమంత్రికి తమను ఆదుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. రూ.31 కోటి 41 లక్షల 59 వేల 741 రూపాయల చెక్కును అందచేసారు.ఈ కార్యక్రమానికి ఎచ్చెర్ల శాసన సభ్యులు గొర్లె కిరణ్ కుమార్, పలాస శాసన సభ్యులు సీదిరి అప్పలరాజు, దువ్వాడ శ్రీకాంత్, జిల్లా గ్రామీణ అభివృధ్ధి సంస్థ పథక సంచాలకులు ఎ.కళ్యాణ చక్రవర్తి, సురంగి మోహనరావు, హనుమంతు కిరణ్ కుమార్, టి.కామేశ్వరి, వివిఎస్.ప్రకాష్, నలుమూలల నుండి విచ్చేసిన జిల్లాలోని అగ్రరోల్డ్ బాధితులు, తదితరులు హాజరైనారు.
అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ప్రభుత్వం ఉంది :స్పీకర్