శ్రీకాకుళం : నవంబరు 18 : గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా ఐదవ రోజు 18వ తేది సోమవారం కేంధ్ర గ్రంధాలయం సమావేశ మందిరంలో వ్యక్తిత్వ వికాస దినోత్సవము నిర్వహించ బడినది.ఇంటాక్ మెంబరు వావిలపల్లి జగన్నాధంనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రవిశ్వ విధ్యాలయం మాజీ పాలకమండలి సభ్యులు జామి భీమశంకరరావు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యకత్త్వ వికాశం పై విద్యార్థినీ, విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగించారు. హైస్కూలు విద్యార్ధులకు క్విజ్ పోటీలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జె. రమణ, కేంద్ర గ్రంధాలయం డిప్యూటీ లైబ్రేరియన్ జి. తిరుమలకుమారి అసిస్టెంట్ లైబ్రేరియన్ ఏ.వి. రమణమూర్తి, గ్రంధాలయ సిబ్బంది పి. మురళీకృష్ణమూర్తి, పి. ఈశ్వరరావు, పి. రామ్మోహన్, భానుమతి, సింహాచలం, ఆఫీసు సిబ్బంది వై. అమర్ నాధ్, ప్రత్యూష, ఎమ్. రాంబాబు, రీడర్స్ తదితరులు పాల్గోన్నారు.
గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా నేడు క్విజ్ పోటీలు