రోడ్డు ప్రమాదంలో ప్లేబేక్ సింగర్ మృతి

ముంబై : నవంబరు 15 : మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరాఠీ ప్లేబ్యాక్ సింగర్ గీతా మాలీ మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదం ముంబై-ఆగ్రా హైవేపై శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఇటీవలే యూఎస్ నుంచి వచ్చిన ఆమె తన స్వస్థలమైన నాసిక్‌కు కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. గీతా మాలీ ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కగా నిలిపివుంచిన ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని ఈ ప్రమాదంలో గీతతో పాటు ఆమె భర్త కూడా తీవ్రగాయాల పాలయ్యారు. వీరిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గీత మృతి చెందారు. కాగా గీత పలు మరాఠీ సినిమాలలో పాటల పాడారు. ఆమె మృతిపై పలువురు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు విచారం వ్యక్తం చేశారు.