చిరకాల వాంఛ నెరవేరింది

ఆమదాలవలస :నవంబరు 20: ఆమదాలవలస మునిసిపాలిటి 15వ వార్డు పరిధిలో పాతినవానిపేట దరిలో ఎన్నో యేళ్ళుగా పరిష్కారం కాకుండా ఉన్నటువంటి, పురిపాకలలో నివశిస్తున్న పారిశుధ్య కార్మికుల ఇల్లు పట్టాలు కోసం గత ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం గారు ఇచ్చిన హామీ మేరకు, ఈరోజు పారిశుధ్య కార్మికుల ఇళ్ళకు పోసిషన్ సర్టిఫికెట్స్ వారి పేరుమీదుగా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్ గారి సమక్షంలో పంపిణీ చేసారు.
 ఈ  పోసిషన్ సర్టిఫికెట్స్ ను  జున్జిరి మౌనిక, జున్జిరి కాళిరావు, దసమంతుల పద్మ, జలజల్ రాజేశ్వరి, దనాల శివకుమారి లకు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దారు పూజారి రాంబాబు, మునిసిపాలిటి వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్ కుమార్, ఆమదాలవలస పట్టణ పార్టీ అధ్యక్షులు పొడుగు శ్రీనివాస రావు,  ఆమదాలవలస మండల వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  తమ్మినేని శ్రీరామ మూర్తి, గురుగుబెల్లి శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ దుంపల శ్యామలరావు,  గురుగుబెల్లి చలపతిరావు,  తిర్లంగి రామారావు,  పెడాడ అశోక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.