ఆర్యవైశ్య సంఘం అద్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం

 శ్రీకాకుళం : నవంబరు 1: అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణను స్మరించుకుంటూ శ్రీకాకుళం పట్టణ ఆర్యవైశ్య సభ్యులు స్థానిక గాంధీ పార్క్ ఆవరణలో గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఆయన త్యాగాన్ని స్మరించు కున్నారు.ఈ సందర్భంగా పలువురు ఆర్యవైశ్య సభ్యులు వారి అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేశారు.తెలుగు వారికి ఒక రాష్ట్రం కోసం ఆయన ప్రాణాల్నే త్యాగం చేసిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నవంబరు 1వ తేదీని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ఆర్యవైశ్యుల తరఫున, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తరఫున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.
1952 డిసెంబరు 15న ఏకంగా 58 రోజుల నిరాహార దీక్ష తర్వాత శ్రీరాములు గారు అమరులయ్యారు. ఆ అమరజీవిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు.ఆయన ఆత్మార్పణ తర్వాత 1953 అక్టోబరు 1వ తేదీన ఒక రాష్ట్రంగా ఏర్పడినా, ఆంధ్రప్రదేశ్ గా 1956 నవంబరు 1వ తేదీన  భాషాప్రయుక్త రాష్ట్రంగా అవతరించాం అని,కాబట్టి నవంబరు 1వ తేదీన  రాష్ట్ర అవతరణ దినోత్సవంగా యేటా జరుపుతామని జగన్ మోహన్ రెడ్డిగారు మాట ఇచ్చారు.ఆడిన మాటకు కట్టుబడి, ఆరేళ్ళ తర్వాత మళ్ళీ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవటం ఆనందంగా ఉంది అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉత్సవాలను మన చరిత్రకు, మహనీయుల త్యాగాలకు నిదర్శనంగా  జరుపుకుంటున్నందుకు గర్వపడుతున్నాం. అని కొనియాడారు.ఈకార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ తమ్మన భాస్కర్ ,పేర్ల సురేష్ చేబోలు విశ్వేశ్వర రావు, మురళీకృష్ణ, వాసవి మండవిల్లి రవి, మండవిల్లి మల్లికార్జున రావు , నటుకుల మోహన్ , మగటపల్లి మల్లికార్జున రావు ,  తదితరులు పాల్గొన్నారు.